🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 13 July 2026, 9:37 pm Posted by : DAINAMIC NEWS

నూతన ఎస్సైని ఘనంగా సన్మానించిన రాఘవపురం ఎక్స్ రోడ్ సర్పంచ్ కోల లింగయ్య గౌడ్ మోతే పోలీస్ స్టేషన్‌లో మర్యాదపూర్వక స్వాగతం

News Image

శుభోదయ డైనమిక్ వార్త , మోతే, జూలై 14




మోతే మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సబ్ ఇన్‌స్పెక్టర్ బి. లచ్చిరెడ్డిని రాఘవపురం ఎక్స్ రోడ్ సర్పంచ్ కోల లింగయ్య గౌడ్ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు.




ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్ష




ఈ సందర్భంగా సర్పంచ్ కోల లింగయ్య గౌడ్ మాట్లాడుతూ, నూతన ఎస్సై నాయకత్వంలో శాంతి భద్రతలు మరింత బలోపేతం కావడంతో పాటు ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందాలని ఆకాంక్షించారు. ఎస్సై బి. లచ్చిరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.




పాల్గొన్న నాయకులు




ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ తాటికొండ సుజిత్ రెడ్డి, కారింగుల లింగమూర్తి గౌడ్, బొడ్డు వెంకటేశ్వర్లు గౌడ్, కారింగుల సైదులు గౌడ్, యువ నాయకుడు కోల అక్షయ్ గౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

🏠 Home