🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 06 July 2026, 5:06 am Posted by : DAINAMIC NEWS

దాచెపల్లి యువకుడి ఘన విజయం వరల్డ్ నేచురల్ బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో వంటల నరేంద్ర కుమార్ ప్రతిభ

News Image

దాచెపల్లి, జూలై 6, శుభోదయ డైనమిక్ వార్త




పల్నాడు జిల్లా దాచెపల్లికి చెందిన యువ బాడీబిల్డర్ వంటల నరేంద్ర కుమార్ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు. జూలై 5న బెంగళూరులో నిర్వహించిన వరల్డ్ నేచురల్ బాడీబిల్డింగ్ ఫెడరేషన్ (WNBF) ఛాంపియన్‌షిప్ పోటీల్లో రెండు విభాగాల్లో అద్భుత విజయాలు సాధించారు.




రెండు విభాగాల్లో మెరుగైన ర్యాంకులు




వంటల వెంకటేశ్వర్ల కుమారుడైన నరేంద్ర కుమార్ ఓపెన్ ఫిట్‌నెస్ మోడల్ విభాగంలో ద్వితీయ స్థానం (రన్నరప్) కైవసం చేసుకోగా, మెన్స్ ఫిజిక్ విభాగంలో ఐదో స్థానం సాధించి తన ప్రతిభను చాటుకున్నారు.




పట్టుదలకు ప్రతిఫలం




సహజ బాడీబిల్డింగ్ రంగంలో క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకితభావంతో సాధన చేసిన నరేంద్ర కుమార్‌కు ఈ విజయం ప్రతిఫలంగా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై రాణించి దాచెపల్లి పేరును దేశవ్యాప్తంగా చాటారు.




అభినందనల వెల్లువ




ఈ విజయంతో నరేంద్ర కుమార్‌కు కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రీడాభిమానులు, అభిమానులు, దాచెపల్లి ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు.

🏠 Home