🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 18 June 2026, 9:02 am Posted by : DAINAMIC NEWS

మేకల వెంకటేశ్వర్లు మృతి భాజపాకు తీరని నష్టం: సంకినేని వెంకటేశ్వరరావు గడ్డిపల్లిలో సంతాప కార్యక్రమంలో నివాళులు

News Image

గరిడేపల్లి, జూన్ 18,శుభోదయ డైనమిక్ వార్త




తెలంగాణ మలిదశ ఉద్యమ పోరాట యోధుడు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మేకల వెంకటేశ్వర్లు ఆకస్మిక మృతి భాజపాకు తీరని లోటని మాజీ ఎమ్మెల్యే, భాజపా కేంద్ర నాయకుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు.




పార్టీ అభివృద్ధికి విశేష సేవలు




గురువారం గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో మేకల వెంకటేశ్వర్ల నివాసంలో నిర్వహించిన సంతాప కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, అంకితభావం, కృషి, పట్టుదలతో పార్టీ కోసం నిరంతరం పనిచేసిన నాయకుడు మేకల వెంకటేశ్వర్లని కొనియాడారు. పార్టీ ఎదుగుదలకు విశేషంగా శ్రమించారని పేర్కొన్నారు.




క్రమశిక్షణ కలిగిన నాయకుడి అకాల మరణం బాధాకరం




గడ్డిపల్లి మాత జాతర సందర్భంగా పార్టీ ఫ్లెక్సీలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారని గుర్తు చేశారు. మంచి క్రమశిక్షణ, సేవా దృక్పథం కలిగిన నాయకుడు చిన్న వయసులోనే అకాల మరణం చెందడం పార్టీకి తీవ్ర మనోవేదన కలిగించిందన్నారు.




కుటుంబ సభ్యులకు పరామర్శ




ఈ సందర్భంగా మేకల వెంకటేశ్వర్ల కుటుంబ సభ్యులను పరామర్శించిన సంకినేని వెంకటేశ్వరరావు వారికి మనోధైర్యం నూరిపోశారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.




పాల్గొన్న నాయకులు




ఈ కార్యక్రమంలో టెలికాం అడ్వైజరీ కమిటీ మాజీ బోర్డు సభ్యులు సంధ్యాల సైదులు, పోకల వెంకటేశ్వర్లు, గరిడేపల్లి, పెన్‌పహాడ్ మండల అధ్యక్షులు కుక్కడపు వెంకటేశ్వర్లు, తాళ్లపల్లి మధు, జిల్లా కార్యదర్శి తాళ్ల నరేందర్‌రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు పోకల రాములు, కొణతం సత్యనారాయణరెడ్డి, అన్నారం సర్పంచ్ సుందరి రామారావు, రామినేని కృష్ణయ్య, రామినేని బిక్షమయ్య, కొప్పుల రాంరెడ్డి, చిత్తలూరి సోమయ్య, ఎడవెల్లి బాటసారి తదితరులు పాల్గొన్నారు.

🏠 Home