🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 May 2026, 3:21 am Posted by : DAINAMIC NEWS

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా చలసాని శ్రీనివాసరావు నియామకం

News Image

నేరేడుచర్ల, మే 5,శుభోదయ డైనమిక్ వార్త




సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన చలసాని శ్రీనివాసరావును నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.




పార్టీ సేవలకు గుర్తింపు




చలసాని శ్రీనివాసరావు మరియు ఆయన కుటుంబ సభ్యులు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేసిన సేవలను గుర్తిస్తూ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య ప్రతిపాదనతో ఈ నియామకం జరిగింది.




గత పదవులు – అనుభవం




శ్రీనివాసరావు గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, చిల్లేపల్లి సహకార సంఘం చైర్మన్‌గా సేవలందించారు. ప్రస్తుతం ఆయన సతీమణి చలసాని మంజుల కల్లూరు గ్రామ సర్పంచ్‌గా కొనసాగుతున్నారు.




పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: శ్రీనివాసరావు




ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్తులో జరగనున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా పనిచేస్తానని తెలిపారు.




నాయకులకు కృతజ్ఞతలు




తన నియామకానికి సహకరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి, జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం చిన్న వెంకటరెడ్డి సహా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.




హర్షం వ్యక్తం చేసిన నాయకులు, కార్యకర్తలు




శ్రీనివాసరావు నియామకంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

🏠 Home