🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 March 2026, 7:54 am Posted by : DAINAMIC NEWS

కారంపూడిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మాచర్ల నియోజకవర్గ మహాసభ

News Image

కారంపూడి, మార్చి 31, డైనమిక్ న్యూస్




ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మాచర్ల నియోజకవర్గ మహాసభ సోమవారం కారంపూడిలో ఘనంగా నిర్వహించబడింది. సమావేశానికి సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్, రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము, సిపిఐ మాచర్ల ఏరియా కార్యదర్శి మేకపోతు శ్రీనివాస్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు.




నూతన కమిటీ ఎన్నిక




ఈ మహాసభలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మాచర్ల నియోజకవర్గ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.




ఏరియా కార్యదర్శిగా మేకపోతు చిన్నకోటిరెడ్డి




నియోజకవర్గ అధ్యక్షుడిగా గాలం శ్రీనివాసరావు




లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.




కమిటీ సభ్యుల ఎంపిక




కమిటీ సభ్యులుగా చేపూరి వీరబ్రహ్మచారి, సిహెచ్ నాగేశ్వరావు, ఎం దావీదు, కే లచ్చిరెడ్డి, ముళ్ళ పాపయ్య, మామిడి లాజరు లను కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.




ఇతర నాయకుల పాల్గొనడం




ఈ కార్యక్రమంలో కారంపూడి మండల కార్యదర్శి షేక్ సైదా, పట్టణ కార్యదర్శి సూర్య హనుమంతరావు, ఏకే నాగమణి, షేక్ సుభాని తదితరులు పాల్గొని మహాసభను విజయవంతం చేశారు.





🏠 Home