🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 29 March 2026, 1:21 am Posted by : DAINAMIC NEWS

పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఆకతాయిల అరెస్టుముగ్గురిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు

News Image

డైనమిక్ న్యూస్, మాసాయిపేట్, మార్చి 29




చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఘటనలో ముగ్గురు ఆకతాయిలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.




ట్రాఫిక్ జామ్‌కు కారణమైన రాంగ్ రూట్ డ్రైవింగ్




ఈ నెల 27న సాయంత్రం సుమారు 7:15 గంటల సమయంలో చేగుంట రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మెదక్ వైపు నుండి వచ్చిన TG35 9676 నంబర్ గల కారు రాంగ్ రూట్‌లో వచ్చి గేటు వద్ద అడ్డంగా నిలవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ క్రమంలో అంబులెన్స్ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుంది.




పోలీసులపై దాడి




సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కారు డ్రైవర్ ఎరువ విజయ్ కృష్ణ పోలీసుల విధులకు అడ్డంకిగా మారి, దుర్భాషలాడుతూ ఒక కానిస్టేబుల్‌పై శారీరక దాడికి దిగాడు.అతనికి తోడు అతని భార్య దనుశ్రీతో పాటు స్నేహితులు రామన్న పవన్, వంజరి బాలాజీ కూడా చేరి పోలీసు సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనలో మరో పోలీసుకు గాయాలు కాగా, బ్లూ కోట్ ట్యాబ్‌ను ధ్వంసం చేశారు.




కేసు నమోదు – అరెస్టులు




ఈ ఘటనపై చేగుంట పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 93/2026గా కేసు నమోదు చేసి, BNS చట్టంలోని సంబంధిత సెక్షన్లు మరియు PDPP చట్టం కింద దర్యాప్తు ప్రారంభించారు.కేసుకు సంబంధించి నిందితులు ఎరువ విజయ్ కృష్ణ, రామన్నగారి పవన్, వంజరి బాలాజీని 28న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.




దర్యాప్తు కొనసాగింపు




ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

🏠 Home