🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 19 March 2026, 9:29 am Posted by : DAINAMIC NEWS

నేరేడుచర్లలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ముస్లిం సోదరులతో సౌహార్ద వాతావరణంలో కార్యక్రమం

News Image

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, మార్చి 19




రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నేరేడుచర్ల మండలంలోని జాన్పహాడ్ రోడ్ మసీదు వద్ద బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో, అన్నదమ్ముల భావంతో జరిగింది.




ప్రజాప్రతినిధులు, నాయకుల పాల్గొనడం




ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అరిబండి సురేష్ బాబు, మాజీ డీసీసీబీ డైరెక్టర్, ప్రస్తుత కౌన్సిలర్ దొండపాటి అప్పిరెడ్డి, మాజీ ఎంపీపీ చెన్నబోయిన సైదులు, మాజీ మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగండ్ల శ్రీధర్, ఇంజమూరీ యశోద రాములు పాల్గొన్నారు.




కౌన్సిలర్లు, కార్యకర్తల హాజరు




కౌన్సిలర్లు గూగులోతు రవీందర్ నాయక్, వాస జ్యోతి శేఖర్, వస్కుల సుదర్శన్, వెంకన్న గౌడ్, పాల్వాయి కృష్ణమూర్తి, రాపోలు నవీన్ తదితరులు హాజరయ్యారు. అలాగే ముస్లిం మైనార్టీ నాయకులు హుస్సేన్, కుమార్, నందిపాటి గురవయ్య, భరత్, లకుమల్ల నాగరాజు మరియు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




మతసామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్




ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రంజాన్ పర్వదినం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు.









🏠 Home