🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 18 March 2026, 5:20 am Posted by : DAINAMIC NEWS

ప్రైవేట్ ఆసుపత్రులకు తప్పనిసరి రిజిస్ట్రేషన్

News Image

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, మార్చి 18




సూర్యాపేట జిల్లా పరిధిలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఎక్స్-రే, స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీలో నమోదు చేసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ తెలిపారు.




అన్ని వైద్య సేవా సంస్థలకు వర్తింపు




ఆయుర్వేద, హోమియోపతి, యునాని, న్యాచురపతి, ఫిజియోథెరపీ తదితర వైద్య సేవలు అందించే అన్ని ప్రైవేట్ సంస్థలు ఈ నిబంధనలను పాటించాలని ఆయన స్పష్టం చేశారు.




చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ అవసరం




తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం-2010, రూల్స్-2022 ప్రకారం ప్రతి సంస్థ రిజిస్ట్రేషన్ పొందడం తప్పనిసరి అని పేర్కొన్నారు.




రిజిస్ట్రేషన్ లేకుంటే కఠిన చర్యలు




రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాక్టీస్ చేయడం చట్టవిరుద్ధమని, అలాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




రీన్యువల్ చేయని సంస్థలపై చర్యలు




గడువు ముగిసిన రిజిస్ట్రేషన్ కలిగిన సంస్థలు తప్పనిసరిగా రీన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.

🏠 Home