🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 07 March 2026, 11:11 am Posted by : DAINAMIC NEWS

జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా చెన్నగాని బాలకృష్ణ గౌడ్

News Image

డైనమిక్ న్యూస్, హుజూర్ నగర్, మార్చి 7




సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌కు చెందిన చెన్నగాని బాలకృష్ణ గౌడ్‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేసి బాధ్యతలు అప్పగించారు.




బీసీల అభ్యున్నతికి కృషి చేయాలి




ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీల సంక్షేమం, అభ్యున్నతి కోసం సంఘం బలోపేతం కావాలని అన్నారు. బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.




సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటా




చెన్నగాని బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించిన జాజుల శ్రీనివాస్ గౌడ్‌కు, సహకరించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం బలోపేతం చేయడంతో పాటు బీసీల సమస్యల పరిష్కారానికి అలుపెరుగని కృషి చేస్తానని పేర్కొన్నారు.




పాల్గొన్న నాయకులు




ఈ కార్యక్రమంలో కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రమ్ గౌడ్, గొడుగు మహేష్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

🏠 Home