🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 28 February 2026, 12:53 am Posted by : DAINAMIC NEWS

టేక్మాల్ మండలానికి వరాల జల్లు రెండు గ్రామ పంచాయతీ భవనాలకు రూ.40 లక్షలు మంజూరు

News Image

డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 28, టేక్మాల్




మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని గిరిజన తండాల అభివృద్ధికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మరోసారి తన కట్టుబాటును చాటుకున్నారు. మండలంలోని సంగ్యా తండా, సర్మోనికుంట తండా గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు మంజూరు చేయాలని ఆయా గ్రామాల సర్పంచులు సక్రు నాయక్, రేణుక రంగ్ లాల్ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు.




ఒక్కో భవనానికి రూ.20 లక్షలు




ప్రతి గ్రామ పంచాయతీ భవనానికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.40 లక్షలను మంత్రి తక్షణమే మంజూరు చేశారు. మంజూరైన నిధులతో త్వరలోనే ఆధునిక సదుపాయాలతో భవనాల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.




ఘనంగా శంకుస్థాపన




మంజూరైన నిధులతో చేపట్టనున్న భవన నిర్మాణ పనులకు మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.




కార్యక్రమంలో పాల్గొన్నవారు




ఈ కార్యక్రమంలో టేక్మాల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నిమ్మ రమేష్, మాజీ అధ్యక్షుడు సుబేదార్ మణికిషన్, జోగిపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎల్లంపల్లి సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు భక్తుల కిషోర్ పాల్గొన్నారు.అదేవిధంగా హసన్ మహమ్మద్ పల్లి సర్పంచ్ చందు నాయక్, నాయకులు రవి, సాయిబాబా, సాయిలు, చందర్, శంకర్, రమేష్, ఏఈ రమేష్, పంచాయతీ కార్యదర్శులు నర్సింలు, నాగరాజు తదితరులు హాజరయ్యారు.




తండా వాసుల హర్షం








తమ విన్నపానికి తక్షణ స్పందన తెలుపుతూ నిధులు మంజూరు చేసిన మంత్రి దామోదర రాజనర్సింహకు సంగ్యా తండా, సర్మోనికుంట తండా ప్రజలు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామాభివృద్ధికి ఇది మైలురాయిగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

🏠 Home