🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 26 February 2026, 4:53 am Posted by : DAINAMIC NEWS

సూర్యాపేటలో ఇంటర్ పరీక్షల కోసం ఎగ్జామ్ కిట్ల కొనుగోలు ఫిబ్రవరి 28న కోటేషన్ల స్వీకరణ – జిల్లా విద్యాశాఖ అధికారి ప్రకటన

News Image

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 26




సూర్యాపేట జిల్లాలో నిర్వహించనున్న 2026 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసం అవసరమైన ఎగ్జామినేషన్ కిట్ల సరఫరాకు జిల్లా విద్యాశాఖ అధికారి కోటేషన్లు ఆహ్వానించారు. ఫిబ్రవరి 28, 2026న మధ్యాహ్నం 2 గంటల వరకు కోటేషన్లు స్వీకరించబడతాయని వెల్లడించారు.




సాయంత్రం 4 గంటలకు కోటేషన్ల తెరవడం




ఇంటిగ్రేటెడ్ జిల్లా కార్యాలయ సముదాయం (IDOC)లోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం, గది నెం. S-26లో కోటేషన్లు స్వీకరించబడతాయి. అదే రోజు సాయంత్రం 4 గంటలకు జిల్లా కలెక్టర్ సమక్షంలో కోటేషన్లు తెరవనున్నట్లు తెలిపారు.




6,784 మంది విద్యార్థులకు కిట్లు




జిల్లాలో పరీక్షలకు హాజరయ్యే 6,784 మంది విద్యార్థులకు అవసరమైన సామగ్రి సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రతి విద్యార్థికి ఒక 5 మి.మీ. ఎగ్జామ్ ప్యాడ్, ఐదు బ్లూ బాల్ పాయింట్ పెన్లు, ఒక బ్లాక్ పెన్, ఒక లాంగ్ స్కేల్, ఒక జ్యామెట్రీ బాక్స్, ఒక అప్సరా పెన్సిల్ అందించాల్సి ఉంటుంది. మొత్తం 67,840 వస్తువులు సరఫరా చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.




నిబంధనలు తప్పనిసరి




కోటేషన్‌లో జీఎస్టీ నంబర్, పూర్తి చిరునామా, సంప్రదింపు వివరాలు తప్పనిసరిగా పేర్కొనాలి. సరఫరా చేయాల్సిన వస్తువులు మంచి నాణ్యత కలిగి ఉండాలని స్పష్టం చేశారు. కోటేషన్ కవర్‌పై “Quotation for Supply of Examination Kits, Writing Pads & Geometry Boxes” అని స్పష్టంగా రాయాలని సూచించారు.




నిర్దిష్ట గడువులో దరఖాస్తులు




ఫిబ్రవరి 26, 2026 మధ్యాహ్నం 2 గంటలలోపు సీల్డ్ కోటేషన్లు కార్యాలయానికి చేరేలా చూడాలని, ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోబోమని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.మండల వారీ విద్యార్థుల జాబితాను కూడా కార్యాలయం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.





🏠 Home