🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 26 February 2026, 4:35 am Posted by : DAINAMIC NEWS

నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్‌కు ఘన సన్మానంతెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్యక్రమం

News Image

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 26




ఉమ్మడి నేరేడుచర్ల మండల పరిధిలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా నూతనంగా ఎన్నికైన నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ కొనతం చిన్న వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి మరియు కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్చాలు అందించి, శాలువాలతో కప్పి అభినందనలు తెలిపారు.




ప్రజాసేవలో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్ష




ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ, పట్టణాభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పార్టీలకు అతీతంగా ప్రజాసేవ చేయాలని సూచించారు.




ఉద్యమకారుల పాల్గొనడం




ఈ కార్యక్రమంలో మలిదశ ఉద్యమకారులు కొణతం లచ్చిరెడ్డి, పంగ శ్రీను, గోపగాని మారయ్య గౌడ్, లావుడియా శ్రీను నాయక్, బాండవత్ రామారావు నాయక్, నందిపాటి హిందూజా, జింకల భాస్కర్, కాలం సైదులు, కాలం నాగయ్య, కట్ట వెంకటరెడ్డి, చిలక బాబు, హరిబాబు, ఆరే సైదులు, జక్కన్న, గోవిందు, రాములు, సీతారాములు, భరత్, జయకృష్ణ, నాగరాజు, యలమంద, సుబ్బారెడ్డి, పొలకట్ల శీను తదితరులు పాల్గొన్నారు.

🏠 Home