🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 23 February 2026, 9:26 am Posted by : DAINAMIC NEWS

అభినందన సన్మానసభ జిల్లాస్థాయి భజన పోటీల విజేతలకు ఘన సత్కారం

News Image

డైనమిక్ న్యూస్, హుజూర్ నగర్, ఫిబ్రవరి 23




ఇటీవల గడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన జిల్లాస్థాయి భజన పోటీలలో హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన శ్రీ అన్నమయ్య భజన మండలి ప్రథమ బహుమతి, శ్రీ గీతాగోవిందం భజన మండలి ద్వితీయ బహుమతి సాధించిన సందర్భంగా కనకదుర్గ సేవా సమాజం ఆధ్వర్యంలో అభినందన సన్మాన సభ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం శ్రీ బాచిమంచి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది. మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా హాజరై విజేత భజన మండలి సభ్యులను శాలువాలు, స్మృతిచిహ్నాలతో ఘనంగా సత్కరించారు.




భజన బృందాల సేవ అభినందనీయం




ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, అంతరించిపోతున్న హిందూ సనాతన సాంప్రదాయ ధర్మాన్ని కాపాడటంలో భజన బృందాలు చేస్తున్న సేవ అమూల్యమని కొనియాడారు. యువత భక్తి మార్గంలో నడవడానికి ఈ బృందాలు ప్రేరణగా నిలుస్తున్నాయని తెలిపారు.




ప్రత్యేక పూజలు – ఆశీర్వాదాలు




కార్యక్రమానికి ముందు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జునరావు, ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి, 10వ వార్డు కౌన్సిలర్ చన్నగాని సైదులు, 3వ వార్డు కౌన్సిలర్ సులవ చంద్రశేఖర్ నాగలక్ష్మి తదితరులను వేద బ్రాహ్మణులు ఆశీర్వదించి అమ్మవారి శేషవస్త్రాన్ని బహుకరించారు.




పలువురు ప్రముఖుల హాజరు




ఈ కార్యక్రమంలో సీనియర్ రంగస్థల కళాకారులు దొంతగాని సత్యనారాయణ, స్పందన నాట్య కళామండలి అధ్యక్షులు కొట్టు లక్ష్మీనారాయణ బాబు, బాచిమంచి కొండయ్య, అనంతలక్ష్మి, చప్పిడి బిక్షం, ఆకుల రాము, రజని, వెన్న పద్మ, దామెర అనంతలక్ష్మి, ఆరేపల్లి సరస్వతి, పెద్ది పుష్ప రమణ, రంగమ్మ, సుబ్బమ్మ, జొన్నలగడ్డ గోవిందు, నాగలక్ష్మి, సురేష్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ఉప్పల బద్రీనాథ్, కీతా సత్యనారాయణ, గూడెపు వీరబాబు, కటారి వెంకన్నతో పాటు కట్టవారిగూడెం శ్రీ సీతారామాంజనేయ భజన బృందం సభ్యులు, అనేక మంది భక్తులు పాల్గొన్నారు.సభా వాతావరణం భక్తి గీతాలతో, సన్మానాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.

🏠 Home