🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 11 February 2026, 12:35 am Posted by : DAINAMIC NEWS

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఓటు హక్కు వినియోగం కృష్ణానగర్ కాలనీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు

News Image

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 11




మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.బుధవారం స్థానిక కృష్ణానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వార్డు నంబర్–14, పోలింగ్ స్టేషన్ నంబర్–49 వద్ద ఆయన ఓటు వేశారు.




ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు వేయాలి




ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకుని నిర్భయంగా ఓటు వేసి స్థానిక స్వపరిపాలనలో భాగస్వాములు కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.









🏠 Home