🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 08 February 2026, 9:08 pm Posted by : DAINAMIC NEWS

నేరేడుచర్ల గవర్నమెంట్ హాస్పిటల్ లో సురక్షితంగా సాధారణ ప్రసవం 2.8 కేజీల పండంటి ఆడబిడ్డ జననం

News Image

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 9




నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సోమవారం తెల్లవారుజామున వైద్య సిబ్బంది అప్రమత్తతతో సాధారణ ప్రసవం విజయవంతంగా జరిగింది.




పురిటి నొప్పులతో పి హెచ్ సీ కు వచ్చిన గర్భిణి




తండాకు చెందిన రూపావత్ స్వరూప (భర్త: లక్ష్మణ్) తెల్లవారుజామున 12:30 గంటల సమయంలో పురిటి నొప్పులతో నేరేడుచర్ల పి హెచ్ సీ కు చేరుకుంది.




వెంటనే వైద్య చర్యలు




గర్భిణిని వెంటనే డాక్టర్ పున్న నాగిని పరిశీలించి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రసవానికి కావాల్సిన ఏర్పాట్లు చేపట్టారు.




ఉదయం 6:05కి ఆడబిడ్డ జననం




అన్ని వైద్య చర్యలు పూర్తి చేసిన అనంతరం తెల్లవారుజామున 6:05 నిమిషాలకు 2.8 కేజీల బరువుతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.




వైద్య సిబ్బంది పాత్ర




ఈ సాధారణ ప్రసవంలో డాక్టర్ పున్న నాగిని, నర్సింగ్ ఆఫీసర్ స్వాతి, ANM భూలక్ష్మి, ఆశా కార్యకర్త సైదమ్మ కీలక పాత్ర పోషించారు.

🏠 Home