🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 03 February 2026, 4:46 am Posted by : DAINAMIC NEWS

13 వార్డులకు సీపీఎం పార్టీ బి ఆర్ ఎస్ పార్టీ కి సంపూర్ణ మద్దతు నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల్లో రెండు వార్డుల్లో సీపీఎం అభ్యర్థులను గెలిపించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు

News Image

డైనమిక్ న్యూస్, నేరేడుచర్ల ,ఫిబ్రవరి 3




ఈనెల 11న జరగనున్న నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల్లో మిగతా 13 వార్డుల్లో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు సీపీఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు స్పష్టం చేశారు. అదే విధంగా నేరేడుచర్ల మున్సిపాలిటీలో సీపీఎం తరఫున పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.




సీపీఎం పట్టణ కమిటీ సమావేశం




నేరేడుచర్ల సీపీఎం పట్టణ కమిటీ సమావేశంలో మంగళవారం నాడు ఎస్ కే హఫీజ్ అధ్యక్షతన సీపీఎం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పారేపల్లి శేఖర్ రావు మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలను ప్రజల సమస్యల పరిష్కారానికి దోహదపడే విధంగా మలచుకోవాలని సూచించారు.




సీపీఎం అభ్యర్థుల వివరాలు




నేరేడుచర్ల మున్సిపాలిటీలో




10వ వార్డు నుంచి కొదమగుండ్ల సరిత,




14వ వార్డు నుంచి తాడోజు పద్మ




సీపీఎం అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈ ఇద్దరు అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులు, ప్రజలను కోరారు.




బి ఆర్‌ఎస్ అభ్యర్థుల విజయానికి ప్రచారం




మిగతా 13 వార్డుల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థుల విజయానికి సీపీఎం శ్రేణులు సంపూర్ణంగా ప్రచారంలో పాల్గొంటాయని, ప్రజల మద్దతును సమీకరించే బాధ్యత తీసుకుంటామని పేర్కొన్నారు.




సమావేశంలో పాల్గొన్న నాయకులు




ఈ సమావేశంలో సీపీఎం పట్టణ కార్యదర్శి కొదమగుండ్ల నాగేష్, కుంకు తిరుపతయ్య, నీల రామ్మూర్తి, సట్టు శ్రీను, మొగిలిచర్ల రుద్రమ్మ, కృష్ణవేణి, గుర్రం ఏసు, పాతూరి శ్రీనివాసరావు, దోరేపల్లి వెంకటేశ్వర్లు, షర్టు వెంకన్న, కొండ వెంకన్న, బంకు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

🏠 Home