🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 January 2026, 12:14 am Posted by : DAINAMIC NEWS

గద్దర్ స్ఫూర్తి పురస్కారంతో డాక్టర్ గుంటి పిచ్చయ్యకు ఘనత

News Image

మఠంపల్లి, డైనమిక్ న్యూస్, జనవరి 31




గద్దర్ జయంతి సందర్భంగా పురస్కారం ప్రదానంసూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ నటుడు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ డాక్టర్ గుంటి పిచ్చయ్యకు గద్దర్ పుట్టినరోజు సందర్భంగా గద్దర్ స్ఫూర్తి పురస్కారం లభించింది. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గద్దర్ కుమార్తె, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ వెన్నెల గద్దర్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.




సాంస్కృతిక సేవలకు గుర్తింపు




సమాజహితాన్ని చాటే నటన, కళా రంగంలో విశేష సేవలు, ప్రజాసంస్కృతిని ముందుకు తీసుకెళ్లడంలో చేసిన కృషికి గాను డాక్టర్ గుంటి పిచ్చయ్యను ఈ పురస్కారంతో సత్కరించారు.




ప్రముఖుల అభినందనలు




ఈ కార్యక్రమంలో ఇండో కెనడియన్ యూత్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు ఓ.యు. రితేష్ బాబు, పుడమి సాహితి వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సి.హెచ్. బాల్ రెడ్డి, పాన్ ఇండియన్ సోషల్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అద్దంకి రాజు తదితరులు పాల్గొని డాక్టర్ గుంటి పిచ్చయ్యను అభినందించారు.




హర్షం వ్యక్తం చేసిన అభిమానులు




గద్దర్ స్ఫూర్తి పురస్కారం అందుకోవడం పట్ల డాక్టర్ గుంటి పిచ్చయ్య అభిమానులు, కళారంగ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

🏠 Home