🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 28 January 2026, 7:42 am Posted by : DAINAMIC NEWS

నేరేడుచర్ల మున్సిపల్ నామినేషన్ కేంద్రం తనిఖీ ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగేందుకు ఏర్పాట్లపై అధికారుల సమీక్ష

News Image

నేరేడు చర్ల, డైనమిక్ న్యూస్, జనవరి 28




నేరేడుచర్ల పట్టణంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను హుజూర్‌నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు బుదవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు, తహసిల్దార్ సురిగీ సైదులు లతో కలిసి నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను తనిఖీ చేశారు.




భద్రత, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి




నామినేషన్ కేంద్రంలో అభ్యర్థులు, ప్రతిపాదకులు, సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆర్డీఓ అధికారులకు సూచించారు. కౌంటర్లు, వేచి ఉండే ప్రదేశాలు, తాగునీరు, శౌచాలయాలు తదితర మౌలిక వసతులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.




ఎన్నికల నిబంధనల కచ్చితమైన అమలు




ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలని ఆర్డీఓ ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.




సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు




నామినేషన్ స్వీకరణలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అభ్యర్థులకు అవసరమైన మార్గనిర్దేశం అందించాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేయడం అందరి సమిష్టి బాధ్యత అని పేర్కొన్నారు.

🏠 Home