🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 25 January 2026, 7:08 am Posted by : DAINAMIC NEWS

మేరా భారత్ మహాన్ ఎక్స్‌క్లూజివ్ సర్వీస్ అవార్డ్‌కు కుక్కమూడి ప్రసాద్ పల్నాడు జిల్లా దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడికి ఘన సత్కారం

News Image

దుర్గి,జనవరి 25 , డైనమిక్ న్యూస్




పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం ముటుకూరు గ్రామానికి చెందిన దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, పల్నాడు జిల్లా ఎస్సీ–ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కుక్కమూడి ప్రసాద్ అలియాస్ ప్రసాదరావుకు మేరా భారత్ మహాన్ ఎక్స్‌క్లూజివ్ సర్వీస్ అవార్డ్–2026 లభించింది.




రిపబ్లిక్ డే సందర్భంగా అవార్డు ప్రదానం




మార్కాపురం జిల్లా కేంద్రంలోని మార్కాపురం ప్రెస్ క్లబ్‌లో, గ్లోబల్ హెల్ప్ ఫౌండేషన్ ఫౌండర్ & చైర్మన్ గాట్టేముక్కల చెన్నకేశవులు ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే (జనవరి 26) సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న విశిష్ట వ్యక్తులకు అవార్డులు ప్రదానం చేశారు.




ప్రముఖుల చేతుల మీదుగా సత్కారం




ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ హైకోర్టు చీఫ్ సూపరింటెండెంట్ డా. పివిపి అంజని కుమారి, కృష్ణా జిల్లా గుడివాడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇ. రమణమ్మ హాజరై కుక్కమూడి ప్రసాద్‌కు అవార్డు అందజేశారు.అవార్డుతో పాటు మెమొంటో, సర్టిఫికెట్ అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు.




18 ఏళ్ల సేవలకు గుర్తింపు




ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ… గత 18 సంవత్సరాలుగా సామాజిక కార్యకర్తగా, దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎస్సీ–ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద ప్రజలకు ఉచితంగా సేవలందిస్తున్న తన కృషిని గుర్తించి ఈ అవార్డు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.




సేవా బాధ్యత మరింత పెరిగింది




ఈ అవార్డు తనలో మరింత ఉత్సాహాన్ని, బాధ్యతను పెంచిందని పేర్కొంటూ, సమాజానికి మరిన్ని సేవలు అందిస్తానని స్పష్టం చేశారు. తనకు ఈ అవార్డు అందించిన గాట్టేముక్కల చెన్నకేశవులు, డా. అంజని కుమారి, సీఐ రమణమ్మలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




ఇతర అవార్డు గ్రహీతలు




ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సాహితీ సమితి చైర్మన్, దళిత సాహితీవేత్త, గ్లోబల్ హెల్ప్ ఫౌండేషన్ ప్రోగ్రాం కన్వీనర్ డా. నెలపూడి రామకృష్ణ కవి సహా సుమారు 40 మంది అవార్డు గ్రహీతలకు సత్కారం జరిగింది. గుడివాడ ట్రాఫిక్ సీఐ రమణమ్మ, హైకోర్టు ఉద్యోగి అంజాని దేవి, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

🏠 Home