🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 13 December 2025, 2:20 am Posted by : DAINAMIC NEWS

GMR11 – BSR11 ఫ్రెండ్లీ మ్యాచ్ పోస్టర్ ఆవిష్కరణ 17న NG కళాశాలలో మ్యాచ్ నిర్వహణ

News Image

నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,డిసెంబర్ 13




నల్గొండ పట్టణంలోని NG కళాశాలలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న NPL-6 క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా క్రీడాకారులను ఉత్సాహ పరిచే ఉద్దేశంతో ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటలకు జరిగే GMR11 – BSR11 జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌కు సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు.




పోస్టర్ ఆవిష్కరించిన అబ్బగోని రమేష్ గౌడ్




నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి (GMR11), మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి (BSR11) జట్ల మధ్య జరగనున్న ఫ్రెండ్లీ మ్యాచ్ పోస్టర్‌ను నల్లగొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ NG కళాశాలలో ఆవిష్కరించారు.




క్రీడల ద్వారా యువతకు ప్రోత్సాహం




ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, ఇలాంటి క్రీడా పోటీలు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని అన్నారు.




పాల్గొన్న నాయకులు




ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మందడి శ్రీనివాసరెడ్డి, జూలకంటి శ్రీనివాస్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, బొజ్జ శంకర్, బుర్రి యాదయ్య, సమద్, ముషంపల్లి ఉపసర్పంచ్ బీరం కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కత్తుల కోటి, గుమ్మల నాగిరెడ్డి, చింతపల్లి గోపాల్, పాదం అనిల్, యూత్ కాంగ్రెస్ నాయకులు మామిడి కార్తీక్, గాలి నాగరాజు, కంచర్ల ఆనంద్ రెడ్డి, దాసరి విజయ్, రంజిత్, పెరిక అంజయ్య, ఆర్గనైజర్స్ బోనగిరి ప్రభాకర్, పాలకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

🏠 Home