🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 December 2025, 12:37 pm Posted by : DAINAMIC NEWS

కంటైనర్ ఢీకి ఐదుగురు విద్యార్థుల దుర్మరణం నరసరావుపేట ఎంపీ తీవ్ర విచారం వ్యక్తం

News Image

నరసరావుపేట:, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 5




గురువారం సాయంత్రం చిలకలూరిపేట జాతీయ రహదారి పై నాదెండ్ల మండలం గణపవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్‌ను కారు ఢీకొనడంతో ఐదుగురు యువకులు మృతి చెందారు. ఈ ఘటనపై నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.




మృతుల వివరాలు





శ్రీకాంత్, వాసు, మహేష్, రామిరెడ్డి విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ చదువుతున్నట్లు తెలిపారు. మరో మృతి చెందిన విద్యార్థి యస్వంత్ సాయి చలపతి కాలేజీలో చదువుతున్నారు. ఎంపీ మాట్లాడుతూ, “అందరూ యువకులు, ముక్కపచ్చలరు. ఇలాంటి ఘోర ఘటన అత్యంత బాధాకరం” అని అన్నారు.




గాయపడిన విద్యార్థి పరిస్థితి





ఈ ఘోర ఘటనలో కర్తీక్ అనే మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కర్తీక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.




సమగ్ర విచారణకు ఆదేశం




ఈ ప్రమాదానికి కారణమైన అంశాలపై సమగ్రంగా విచారణ చేయాలని ఎంపీ తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.

🏠 Home