🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 28 November 2025, 12:32 am Posted by : DAINAMIC NEWS

సర్పంచ్ అభ్యర్థి నామినేషన్‌కు కొత్త బ్యాంక్ ఖాతా తప్పనిసరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు అమలు – ఎంపీడీవో శ్యామ్ సుందర్ రెడ్డి

News Image

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, నవంబర్ 28




స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు, ఎన్నికలలో పోటీ చేయనున్న ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా కొత్త బ్యాంక్ ఖాతాను ప్రారంభించుకోవాలని ఎంపీడీవో శ్యామ్ సుందర్ రెడ్డి తెలిపారు.




జిల్లా కలెక్టర్ ఆదేశాలు




ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసం, అభ్యర్థుల ఖర్చుల లెక్కల పర్యవేక్షణను సులభతరం చేయాలన్న ఉద్దేశంతో, కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్న విషయం తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.




ఎనీ బ్యాంక్ ఎక్కడైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు




అభ్యర్థులు: ఏ బ్యాంకులోనైనా,అదే బ్యాంకులో కరెంట్ అకౌంట్‌గా,పోస్టాఫీస్ నందు,లేదా ఇతర జాతీయ / ప్రైవేట్ బ్యాంకుల్లో కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చని తెలిపారు.




నామినేషన్‌లో పాస్‌బుక్ తప్పనిసరి




నామినేషన్ దాఖలు చేసే సమయంలో కొత్తగా ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ కాపీని తప్పనిసరిగా జత చేయాలని తెలిపారు. పాస్‌బుక్ లేనిచో నామినేషన్‌ స్వీకరణలో ఇబ్బందులు ఏర్పడే అవకాశముందని హెచ్చరించారు.




అభ్యర్థులు జాగ్రత్త వహించాలి




ఈ విషయాన్ని అందరు పోటీ అభ్యర్థులు గమనించి, ముందుగానే ఖాతా ప్రారంభించుకొని, అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఎంపీడీవో కోరారు.

🏠 Home