🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 24 November 2025, 12:03 pm Posted by : DAINAMIC NEWS

అవసరానికి తగ్గ ఉద్యాన పంటలు వేయండి…ఉద్యానవన డైరెక్టర్ శ్రీనివాసులు…

News Image

నరసరావుపేట, డైనమిక్ న్యూస్, నవంబర్ 24




జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండలం లోని ఉప్పలపాడు గ్రామంలో "రైతన్న మీకోసం" అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా , ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ డాక్టర్ . కే .శ్రీనివాసులు పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం తలపెట్టిన "రైతన్న మీకోసం" కార్యక్రమం జరిగే సరళిని పరిశీలించారు. కార్యక్రమంలో రైతుల యొక్క సర్వే వివరాలను గ్రామ ఉద్యాన సహాయకుల ద్వారా యాప్ లో పొందుపరిచే విధానాన్ని గమనించడం జరిగినది.
ఈ సర్వే ద్వారానీటి భద్రత అనగా రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందించే దిశగా డ్రిప్ పరికరాలు రాయితీ ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు.
అగ్రిటెక్ ద్వారా రైతుల కు కావాల్సిన పరికరాలు రాయితీ ద్వారా అందజేయడం జరుగుతుంది.ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రైతుల పంటలకు విలువ పెరిగే మార్గాలను వివరించారు.ప్రభుత్వం నుంచి రైతులకు ఇచ్చే మద్దతులు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ యొక్క పథకాలను వివరించారు.పైన తెలిపిన విషయాలను రైతు వారీగా యాప్ నందు పొందు పరిచి ఈ యొక్క సర్వే ను ప్రతి గ్రామం నందు ఈ వారం లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.కార్యక్రమం తర్వాత , నకరికల్లు మండలం గుండ్ల పల్లి లో నిర్మాణం లో ఉన్న "సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్," (కూరగాయలు మరియు సుగంధ ద్రవ్యాలు) భవనాలను పరిశీలించారు. ఈ భవనాల నిర్మాణములను ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత జిల్లా అధికారులను డైరెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు.కార్యక్రమంలో ఆంజనేయులు , ప్రాజెక్ట్ డైరెక్టర్, ఏపీఎంఐపి, . ఎస్ కే. నబి రసూల్, ఐ.వెంకటరావు ఉద్యాన అధికారి, ఆంజనేయులు పాల్గొన్నారు.

🏠 Home