🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 24 November 2025, 6:52 am Posted by : DAINAMIC NEWS

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిష్టాత్మకం— పర్యవేక్షణలో మండల ప్రత్యేక అధికారి కీలక పాత్ర: కలెక్టర్ ఇలాతి త్రిపాఠి

News Image

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 24




నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మండల ప్రత్యేక అధికారులు సమగ్రంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ఆమె ఈ సూచనలు చేశారు.




ప్రజావాణిలో 70 ఫిర్యాదుల స్వీకరణ




ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రజల నుండి మొత్తం 70 ఫిర్యాదులు స్వీకరించగా, అందులో రెవెన్యూ శాఖకు 31, మిగతా 39 ఫిర్యాదులు జిల్లా విభాగాలకు చేరాయి.ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రజావాణి కార్యక్రమానికి నిర్దేశించిన సమయానికి తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేశారు.




అన్ని కార్యాలయాలపై ర్యాండమ్ తనిఖీలు




జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ర్యాండమ్‌గా తనిఖీ చేయనున్నట్లు తెలిపారు.ప్రజావాణి కార్యక్రమానికి ఎవరికీ మినహాయింపు లేదని, అత్యవసరం ఉన్నప్పుడు ముందుగా అనుమతి తీసుకోవాలని హెచ్చరించారు.




ఎన్నికల పర్యవేక్షణలో అధికారుల బాధ్యతలు




స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మండలాల ప్రత్యేక అధికారులు అవసరమైతే ఎంపీడీవో కార్యాలయంలో కూర్చొని పర్యవేక్షణ చేయాలి అని కలెక్టర్ పేర్కొన్నారు.ఎన్నికల నిర్వహణలో స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, సంబంధిత శాఖాధికారులు సమగ్ర సమన్వయంతో పని చేయాలని ఆమె సూచించారు.




కార్మికుల బీమా పెంపు గోడపత్రిక ఆవిష్కరణ




ప్రజావాణి అనంతరం జిల్లా కలెక్టర్ ఇలాతి త్రిపాఠి కార్మికుల బీమా పెంపు పై రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక శాఖ అధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.




పాల్గొన్న అధికారులు




స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్,గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్,ఆర్డీవోలు వై. అశోక్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి జిల్లా స్థాయి అధికారులు ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు.

🏠 Home