🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 15 November 2025, 9:02 am Posted by : DAINAMIC NEWS

నల్లగొండలో ప్రత్యేక లోక్ అదాలత్‌– జిల్లా వ్యాప్తంగా 2,921 కేసుల పరిష్కారం

News Image

నల్లగొండబ్యూరో, నవంబర్ 15 , డైనమిక్ న్యూస్




రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, నల్లగొండ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టు ప్రాంగణాలలో ఏకకాలంలో చేపట్టారు.




12 లోక్‌ అదాలత్ బెంచీలు ఏర్పాటు




ప్రజల సౌకర్యార్థం మొత్తం 12 ప్రత్యేక లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేసి కేసుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేశారు.




2,921 కేసులు పరిష్కారం




ప్రత్యేక లోక్ అదాలత్‌లో మొత్తం 2,921 కేసులు (పెండింగ్ & ప్రీ-లిటిగేషన్) పరిష్కరించబడ్డాయి. వీటిలో సివిల్ కేసులు – 31క్రిమినల్ కేసులు 2,813,మోటార్ వాహన ప్రమాద భీమా కేసులు – 45,చెక్ బౌన్స్ కేసులు – 6,సైబర్ క్రైమ్ కేసులు – 26




ప్రమాద భీమా కేసుల్లో రూ.2.95 కోట్లు నష్టపరిహారం




మోటార్ వాహన ప్రమాద భీమా కేసుల్లో కక్షిదారులకు రూ.2,95,35,000/- నష్టపరిహారం అందించగా,సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.2,17,915/- రికవరీ అమలు చేశారు.ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ జిల్లా జడ్జి & చైర్మన్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ జి. సంపూర్ణ ఆనంద్ పాల్గొన్నారు.ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి & కార్యదర్శి పి. పురుషోత్తం రావు, ఇతర న్యాయమూర్తులు,బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు కట్ట అనంత రెడ్డి, మంద నగేష్,న్యాయవాదులు, లా కాలేజీ విద్యార్థులు, కక్షిదారులు, సిబ్బంది పాల్గొన్నారు.

🏠 Home