🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 15 November 2025, 8:51 am Posted by : DAINAMIC NEWS

ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు ఘ‌నంగా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, కలెక్టర్ కృతిక శుక్లా పాల్గోలు

News Image

డైనమిక్ న్యూస్,నరసరావుపేట,నవంబర్15




నరసరావుపేట మండలం పెద్ద తురకపాలెం గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి జన్ జాతీయ గౌరవ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.




రెసిడెన్షియల్ స్కూల్‌ను పరిశీలించిన ప్రజా ప్రతినిధులు




పిల్లలు శుభ్రత పాటించే విధానాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రత్యక్షంగా చూపిస్తూ చేతులు ఎలా కడుకోవాలో సూచనలు ఇచ్చారు. విద్యార్థులతో సంభాషించి వారి చదువు, వసతి, ఆరోగ్య సంబంధ అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.




బిర్సా ముండా పోరాటం స్ఫూర్తిదాయకం : ఎమ్మెల్యే




ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,“ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 1875 జూన్ 15న ఝార్ఖండ్‌లోని ఉలిహతు గ్రామంలో జన్మించారు. బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా ‘ఉల్‌గులాన్’ (మహా తిరుగుబాటు) కు శ్రీకారం చుట్టి గిరిజన హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన మహనీయుడు. కేవలం 25 ఏళ్లకే 1900 జూన్ 9న రాంచీ జAILులో అమరుడయ్యారు. ఆయన ‘అబువా రాజ్ ఏటె జోహార్’ అనే నినాదం గిరిజన హక్కుల ఉద్యమానికి పునాది.” అని చెప్పారు.పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని, స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞగా భవిష్యత్తు తరాలకు పచ్చదనాన్ని అందించాలన్నారు.




స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పరిశుభ్రతపై అవగాహన




అదే రోజు పెద్ద తురకపాలెం గిరిజన బాలికల పాఠశాలలో వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ కృతిక శుక్లాతో కలిసి ఎమ్మెల్యే విద్యార్థినులకు చేతులు కడుక్కోవడం ప్రాముఖ్యతను అర్థం చేసేశారు.అరవింద బాబు మాట్లాడుతూ, “ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో ఆరోగ్యవంతమైన, పరిశుభ్రమైన సమాజాన్ని నిర్మించవచ్చు” అని పేర్కొన్నారు.

🏠 Home