🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 15 November 2025, 8:44 am Posted by : DAINAMIC NEWS

జాతీయ స్థాయి పవర్‌లిఫ్టింగ్‌లో విజ్ఞాన్స్‌ విద్యార్థినికి గోల్డ్‌ మెడల్‌ జాతీయ పోటీల్లో వడ్లమూడి విద్యార్థినికి ఘన విజయము

News Image

డైనమిక్ న్యూస్, గుంటూరు, నవంబర్ 15




గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకి చెందిన ఈటూరి లక్ష్మీ వినయశ్రీ జాతీయ స్థాయి పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించారు. ఆమె అద్భుత ప్రతిభను శనివారం విలేకరులతో మాట్లాడుతూ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ. నాగభూషణ్‌ ప్రశంసించారు.




84 కేజీల విభాగంలో 287.5 కిలోల ఎత్తి గోల్డ్‌




నవంబర్‌ 2 నుంచి 6 వరకు హిమాచల్‌ ప్రదేశ్‌లో పవర్‌లిఫ్టింగ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఫెడరేషన్‌ కప్‌ (మెన్‌ అండ్‌ ఉమెన్‌) చాంపియన్‌షిప్‌లో 84 కేజీల విభాగంలో లక్ష్మీ వినయశ్రీ ప్రతిభ ప్రకాశించింది.బెంచ్ ప్రెస్, స్క్వాడ్, డెడ్‌లిఫ్ట్‌ మూడు కేటగిరీల్లో కలిపి 287.5 కిలోల బరువు ఎత్తి బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.




ఏసియన్ గేమ్స్‌కు నేరుగా అర్హత




ఈ విజయంతో లక్ష్మీ వినయశ్రీ వచ్చే ఏడాది మేలో చైనాలో జరగనున్న ఏసియన్ గేమ్స్‌కు నేరుగా అర్హత సాధించినట్టు వైస్ చాన్స్‌లర్ తెలిపారు. ఇది విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకి గర్వకారణమని అన్నారు.




విద్యార్థుల ప్రతిభకు ముందస్తు ప్రోత్సాహం




క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను ఉత్సాహపరిచే ఉద్దేశ్యంతో లక్ష్మీ వినయశ్రీ ప్రతిభను ముందుగానే గుర్తించి యూనివర్సిటీ తరఫున 75 శాతం ఫీజు మినహాయింపు ఇచ్చినట్టు కూడా ఆయన పేర్కొన్నారు.




గౌరవం తెచ్చిన వినయశ్రీ – విశ్వవిద్యాలయం ఆనందం




“మా విద్యార్థులు అకాడెమిక్స్‌తో పాటు క్రీడల్లో కూడా ఉన్నత స్థాయిలో ప్రతిభ కనబరుస్తుండటం హర్షణీయం” అని నాగభూషణ్‌ తెలిపారు. యూనివర్సిటీ తరఫున డీన్లు, హెడ్‌లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, కోచ్‌లు, విద్యార్థులు వినయశ్రీను ఘనంగా అభినందించారు.




"ఇది నా కొత్త ఆరంభం" – లక్ష్మీ వినయశ్రీ




బంగారు పతకం సాధించిన ఈటూరి లక్ష్మీ వినయశ్రీ మాట్లాడుతూ,“నా విజయంలో తల్లిదండ్రులు, కోచ్‌లు, యూనివర్సిటీ అందించిన సహకారం ఎంతో దోహదపడింది. ఏసియన్ గేమ్స్‌లో పతకం సాధించి దేశానికి గౌరవం తీసుకురావడం నా తదుపరి లక్ష్యం” అని వెల్లడించింది.






🏠 Home