🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 12 November 2025, 8:50 pm Posted by : DAINAMIC NEWS

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి– ఎంపీడీఓ వంశీధర్ మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఘన సన్మానం

News Image

డైనమిక్, మాడుగులపల్లి , నవంబర్ 13




మాడుగులపల్లి మండలంలోని మహిళలు అన్ని రంగాలలో ముందుండి, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అవకాశాలను వినియోగించుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని మండల ఎంపీడీఓ వంశీధర్ పిలుపునిచ్చారు.బుధవారం మండల కేంద్రంలోని మహిళా సమైక్య కార్యాలయంలో నిర్వహించిన వివోఏల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో నూతన మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా బాధ్యతలు చేపట్టిన వంశీధర్‌ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.




ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి




ఎంపీడీఓ వంశీధర్ మాట్లాడుతూ –“మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. బ్యాంకుల సహకారంతో స్వయం ఉపాధి పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ ఆసరాను సద్వినియోగం చేసుకొని మహిళలు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలి,” అని సూచించారు.




బ్యాంకు రుణాలు సమయానికి చెల్లించాలి




భారతీయ స్టేట్ బ్యాంక్ వేములపల్లి శాఖ మేనేజర్ రమేష్ మాట్లాడుతూ –
“మహిళా సంఘాలు బ్యాంకుల ద్వారా పొందిన రుణాలను సకాలంలో చెల్లించాలి. అప్పులు సకాలంలో చెల్లిస్తే ఇతర సంఘాలకు కూడా రుణాలు సులభంగా అందుతాయి. రుణాల సహకారంతో సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మేము ఆశిస్తున్నాం,” అని అన్నారు.




అధికారులు, మహిళా నేతలు పాల్గొన్నారు




ఈ కార్యక్రమంలో ఏపిఎం మధుసూదన్, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు కొండ సావిత్రమ్మ, కార్యదర్శి మారేపల్లి లక్ష్మీరెడ్డి, కోశాధికారి పుల్లెంల యాదమ్మ, సీసీలు రమణ, ప్రసాద్, సైదులు, మండల పరిధిలోని వివోఏలు తదితరులు పాల్గొన్నారు.

🏠 Home