🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 10 November 2025, 6:04 am Posted by : DAINAMIC NEWS

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి :జిల్లా అదనపు కలెక్టర్ కే. సీతారామారావు ఆదేశాలు

News Image

సూర్యాపేట బ్యూరో, నవంబర్ 10,డైనమిక్




జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చే ప్రతి దరఖాస్తును అధిక ప్రాధాన్యతతో పరిశీలించి, ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ కే. సీతారామారావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల అర్జీలను స్వీకరించారు.




ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి




అధికారులు రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, తేమ శాతం 17 వచ్చిన వెంటనే కాంటా వేసి లారీల ద్వారా మిల్లులకు తరలించాలని సూచించారు. కొనుగోలు వివరాలను ట్యాబ్‌లో నమోదు చేయాలని కూడా ఆదేశించారు.




ప్రజావాణి దరఖాస్తులకు రిజిస్టర్ ఏర్పాటు చేయాలి




ప్రతి శాఖలో ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తుల కోసం ప్రత్యేక రిజిస్టర్ ఏర్పాటు చేసి, ప్రతి దరఖాస్తును నిష్పక్షపాతంగా నమోదు చేయాలని, దాని స్థితిని లబ్ధిదారులకు తెలియజేయాలని ఆయన సూచించారు.




మొత్తం 44 దరఖాస్తులు స్వీకరణ




ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 44 దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. వీటిలో




భూ సమస్యలకు సంబంధించినవి – 26,




ఇరిగేషన్ శాఖకు – 4,




సంక్షేమ శాఖకు – 3,




ఎంపిడిఓలకు – 2,




ఇతర శాఖలకు – 9 దరఖాస్తులు వచ్చాయి.




సంబంధిత అధికారులకు పంపి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు.




అధికారులు పాల్గొన్నారు








ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ వివి అప్పారావు, డి ఎఫ్ ఓ సతీష్ కుమార్, డి పి ఓ యాదగిరి, డి ఇ ఓ అశోక్, సి పీ ఓ కిషన్, డి డబ్ల్యూ ఓ నరసింహారావు, సంక్షేమ అధికారులు శంకర్, శ్రీనివాస్, నరసింహారావు, దయానందరాణి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, జిల్లా క్రీడా అధికారి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

🏠 Home