🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 10 November 2025, 5:18 am Posted by : DAINAMIC NEWS

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు

News Image

నల్గొండ బ్యూరో, నవంబర్ 10 ,డైనమిక్




జిల్లా ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేలా ప్రజావాణి కార్యక్రమంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.




ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్




సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వివిధ రకాల ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. అనంతరం ఆమె సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.




పెండింగ్ ఫిర్యాదులు ఉంచొద్దు




జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, “ఫిర్యాదులు అందిన వెంటనే వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి. అనవసరంగా పెండింగ్‌లో ఉంచొద్దు. పరిష్కారం కాని ఫిర్యాదు ఉంటే ఫిర్యాదుదారునికి స్పష్టమైన వివరణ ఇవ్వాలి. అలాగే, పరిష్కారమైన ఫిర్యాదుల వివరాలను కలెక్టర్ కార్యాలయానికి తప్పనిసరిగా తెలియజేయాలి,” అని అధికారులను ఆదేశించారు.




కింది స్థాయి వరకు సమన్వయం అవసరం




ఫిర్యాదుల పరిష్కారం జిల్లా కేంద్రం నుండి కింది స్తాయి వరకు సమన్వయంతో జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.




మొత్తం 94 ఫిర్యాదులు స్వీకరణ




సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 94 ఫిర్యాదులు స్వీకరించగా, వాటిలో 31 ఫిర్యాదులు జిల్లా అధికారులకు, 63 ఫిర్యాదులు రెవిన్యూ శాఖకు సంబంధించినవిగా గుర్తించారు.












అధికారులు పాల్గొన్నారు




రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, గృహనిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, ఇన్చార్జ్ డిఆర్ఓ వై. అశోక్ రెడ్డి, ఆర్డీవోలు రమణారెడ్డి, శ్రీదేవి, ఇతర జిల్లా అధికారులు పాల్గొని ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు.

🏠 Home