🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 10 November 2025, 4:31 am Posted by : DAINAMIC NEWS

వాహన రవాణా నియమాలు పాటించాలి – రోడ్డు భద్రతే ప్రాధాన్యం పరిమితికి మించి ప్రయాణికుల రవాణా నేరం – ఎస్పీ నరసింహ హెచ్చరిక గత వారం రోజుల్లో 70 వాహనాలపై కేసులు

News Image

సూర్యాపేట బ్యూరో, నవంబర్ 10,డైనమిక్




సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ లక్ష్యంగా వాహనాలపై కఠిన తనిఖీలు కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం, గూడ్స్ వాహనాల్లో ప్రజలను రవాణా చేయడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.




గూడ్స్ వాహనాల్లో ప్రజా రవాణా నిషేధం




గూడ్స్ వాహనాలు సరుకుల రవాణా కోసం మాత్రమే అనుమతించబడ్డాయని, వాటిలో ప్రజలు, కూలీలు లేదా చిన్నపిల్లలను తరలించడం చట్ట విరుద్ధమని పోలీసులు హెచ్చరించారు. చిన్న పిల్లలను గూడ్స్ వాహనాల్లో ప్రయాణించడం వల్ల తీవ్ర ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, ప్రజలు తమ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు.




ఆటోలలో పరిమితికి మించి ప్రయాణం వద్దు




ఆటో రిక్షాలు, ప్రయాణికుల వాహనాల్లో కూడా పరిమితిని మించి ప్రయాణికులను ఎక్కించరాదని అధికారులు సూచించారు. రోడ్డు రవాణా చట్టాలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు.




70 వాహనాలపై కేసులు నమోదు




జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో రవాణా నియమాలు ఉల్లంఘించిన 70 వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పలుమార్లు ఇలాంటి ఉల్లంఘనలు జరిగినట్లయితే వాహనాలను సీజ్ చేసే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.




ప్రజలకూ అవగాహన




ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని, రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసులు కోరారు. ప్రతి ఒక్కరు రవాణా నియమాలను గౌరవించి, పరిమితికి లోబడి వాహనాల్లో ప్రయాణిస్తే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.

🏠 Home