🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 November 2025, 5:25 am Posted by : DAINAMIC NEWS

అథ్లెటిక్స్‌లో ఏపీ టి‌డబ్ల్యూ.ఆర్. స్కూల్ విద్యార్థుల మెరుపు ప్రదర్శన

News Image

డైనమిక్,కారంపూడి, నవంబర్ 5




కారంపూడి మండలంలోని ఏపీ టి‌డబ్ల్యూ.ఆర్. స్కూల్ విద్యార్థినులు అథ్లెటిక్స్ విభాగంలో అద్భుత ప్రతిభ కనబర్చారు. ఎస్‌జీ ఎఫ్‌ఐ గేమ్స్‌లో అండర్–17 విభాగంలో పలు విభాగాల్లో విజేతలుగా నిలిచి, జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారు.




అండర్–17 విభాగంలో సత్తా చాటిన విద్యార్థినులు




నవంబర్ 4న జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో 800 మీటర్ల విభాగంలో ఏపీ టి‌డబ్ల్యూ.ఆర్. స్కూల్ విద్యార్థినులు మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.1500 మీటర్ల రేసులో బి. పూజ (9వ తరగతి) రెండవ స్థానం సాధించగా,400 మీటర్ల విభాగంలో బి. దివ్య విశేష ప్రతిభ కనబర్చింది.లాంగ్ జంప్ విభాగంలో బి. స్వాతి మూడవ స్థానం సాధించి జిల్లా స్థాయికి ఎంపికైంది.




స్కూల్‌కు గర్వకారణం అయిన విజయం




ఈ ఘన విజయంతో పాఠశాల వాతావరణం ఆనందభరితంగా మారింది. విద్యార్థినుల ప్రతిభ పట్ల ప్రధానోపాధ్యాయురాలు సరస్వతి మాట్లాడుతూ,“విద్యార్థినులు కృషి, క్రమశిక్షణతో అద్భుత ఫలితాలు సాధించారు.జిల్లా స్థాయిలో కూడా మెరుగైన ప్రదర్శన ఇవ్వగలరని నమ్మకం ఉంది” అని తెలిపారు.




అభినందనల వర్షం




విజేతలను పి.ఇ.టి. ప్రమీల, మెహరున్నిస సహా బోధనా సిబ్బంది అభినందించారు. విద్యార్థినులు కృషిని కొనసాగించి రాష్ట్ర స్థాయిలో కూడా మెరిసేలా శ్రమించాలని ఉపాధ్యాయులు సూచించారు.

🏠 Home