🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 01 November 2025, 10:08 am Posted by : DAINAMIC NEWS

పశువుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం

News Image

డైనమిక్,పాలకవీడు, నవంబర్ 1




పాలకవీడు మండలంలోని నర్లెంగలగూడెం, గుండెబోయినగూడెం గ్రామాల్లో శనివారం పశుసంరక్షణ శాఖ ఆధ్వర్యంలో పశువుల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గాలి కుంట్ల, యద మరియు గర్భకోశ సంబంధిత వ్యాధులపై వైద్యులు డాక్టర్ సురేష్, గోపాలమిత్ర బృంద సభ్యులు గ్రామస్థులకు వివరించారు. చిన్న దూడలకు నట్టల మందు వేయడం, పశువుల పరిశుభ్రత, పోషకాహారం మరియు రోగనిరోధక చర్యలపై వారికి అవగాహన కల్పించారు.పశువుల ఆరోగ్య సంరక్షణలో నిర్లక్ష్యం వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్థులను వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, మహిళలు మరియు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

🏠 Home