🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 01 November 2025, 6:33 am Posted by : DAINAMIC NEWS

తడిసిన ధాన్యం కొనుగోలు సజావుగా కొనసాగుతోంది – కలెక్టర్ ఇలా త్రిపాఠి

News Image

డైనమిక్,నల్లగొండ బ్యూరో, నవంబర్ 1




మొంథా తుఫాన్ ప్రభావంతో నల్లగొండ జిల్లాలోని పది మండలాల పరిధిలో తడిసిన వరి ధాన్యం యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి తెలిపారు.ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలోని వివిధ కొనుగోలు కేంద్రాల్లో సుమారు 4,600 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తడిసినట్లు గుర్తించామని ఆమె వెల్లడించారు. రైతులు స్వయంగా ఆ ధాన్యాన్ని కొంతమేరకు ఆరబెట్టినప్పటికీ, రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ ఆదేశాల మేరకు ఇప్పటివరకు 2,653 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించామని వివరించారు.రైతులు విక్రయించిన ధాన్య వివరాలను ట్యాబ్ ఎంట్రీల ద్వారా నమోదు చేసి, వారికి రావలసిన మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామని కలెక్టర్ తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయి భరోసా ఇస్తోందని ఆమె అన్నారు.రైతులు తమ పంటను సరైన విధంగా ఆరబెట్టి, తగిన తేమ శాతం వచ్చిన తరువాత మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తరలించాలనీ కలెక్టర్ సూచించారు.జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ నిర్వాహకులకు అవసరమైన సూచనలు అందిస్తున్నారని, అదనపు కలెక్టర్‌తో కలిసి తాను కూడా స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నందున జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని తెలిపారు.

🏠 Home