🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 29 October 2025, 6:24 am Posted by : DAINAMIC NEWS

మోంతా తుఫాన్ ప్రభావం పరిశీలన చింతవాగు వంతెన వద్ద ఎంఆర్వో, ఎస్‌ఐ పరిశీలన జాన్‌పహాడ్ దర్గా రోడ్డుపై చెట్ల తొలగింపు చర్యలు

News Image

డైనమిక్ న్యూస్ – పాలకవీడు,అక్టోబర్29




మోంతా తుఫాన్ ప్రభావంతో పాలకవీడు మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా చింతవాగు వంతెన వద్ద నీటి ప్రవాహం పెరిగి, స్థానిక రవాణాపై ప్రభావం చూపుతోంది.ఈ నేపథ్యంలో బుదవారం మండల తహసీల్దార్ కమలాకర్, ఎస్‌ఐ కోటేష్ కలిసి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. వంతెనపైకి నీరు ఎగబాకే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జాన్‌పహాడ్ దర్గా సమీపంలో రోడ్డుపై అడ్డంగా పడిన చెట్లను జెసిబి సాయంతో తొలగించి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. అధికారులు ప్రజలకు సూచిస్తూ, వరద నీటి ప్రవాహ ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.









🏠 Home