🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 28 October 2025, 9:19 pm Posted by : DAINAMIC NEWS

సూర్యాపేట జిల్లాలో పాఠశాలలకు స్థానిక సెలవుమొంథా తుఫాన్ ప్రభావంతో కలెక్టర్ ప్రకటన

News Image

సూర్యాపేట బ్యూరో,డైనమిక్ , అక్టోబర్ 29




“మొంథా” తుఫాన్ ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని బుధవారం సూర్యాపేట జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రకటించారు.వర్షాల కారణంగా రవాణా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు అధికారిక సూచనలను పాటించాలని, వర్షాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

🏠 Home