🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 28 October 2025, 5:55 am Posted by : DAINAMIC NEWS

వర్షాల హెచ్చరికతో కలెక్టర్ అలర్ట్‌! రైతులకు సూచనలు 48 గంటలపాటు సూర్యాపేట జిల్లాలో వర్షాల సూచన

News Image

సూర్యాపేట బ్యూరో , డైనమిక్, అక్టోబర్ 28




జిల్లాలో వచ్చే 48 గంటలపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యపు రాశులపై టార్పాలిన్ పట్టాలు కప్పాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు.




ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన




మంగళవారం కలెక్టర్ ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం, అలాగే ఎన్‌డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే అర్వపల్లి, వేల్పుచర్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.కేంద్రాల్లో ధాన్యం నిల్వ పరిస్థితులు, తూకం, రవాణా ఏర్పాట్లు, రైతులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.




"వరి కోతకు తొందరపడవద్దు" – కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్




మెంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు వరి పొలాలు కోయకుండా సహకరించాలి. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని టార్పాలిన్ పట్టాలతో కప్పి రక్షించాలి” అని సూచించారు.




అధికారులతో సమీక్ష




ఈ కార్యక్రమంలో డి.ఎస్.ఓ. మోహన్ బాబు, డి.ఎం. రాము, తహసీల్దార్ శ్రీకాంత్, ఏ.ఎస్.ఓ. శ్రీనివాస్ రెడ్డి, ఆర్‌.ఐ. శ్రీకాంత్ రెడ్డి, ఏ.ఓ. గణేష్, ఏ.ఈ.ఓ. సత్యం, ఏ.పి.ఎం. రాంబాబు, సెంటర్ ఇంచార్జి విజయ తదితర అధికారులు  పాల్గొన్నారు.













🏠 Home