🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 October 2025, 2:32 am Posted by : DAINAMIC NEWS

ములకలపల్లిలో గ్రామపరిపాలన అధికారి లంచం కేసులో ఎసీబీకి పట్టుబాటు

News Image

భద్రాద్రి కొత్తగూడెం ,డైనమిక్ , అక్టోబర్ 27




భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ గ్రామపరిపాలన అధికారి ఎసీబీ అధికారుల బారిన పడ్డాడు.వివరాల ప్రకారం, ములకలపల్లి మండలంలోని పూసుగూడెం గ్రామానికి చెందిన గ్రామపరిపాలన అధికారి బానోత్ శ్రీనివాస్ నాయక్, వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఓ రైతు నుండి మొత్తం ₹60,000 లంచం కోరినట్లు సమాచారం. ఇప్పటికే ₹40,000 తీసుకున్న అతడు, మిగిలిన ₹15,000 లంచం స్వీకరిస్తున్న సమయంలో, ఎసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఈ ఆపరేషన్‌ను ఎసీబీ డీఎస్పీ వై. రమేష్ పర్యవేక్షణలో నిర్వహించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు, మరిన్ని వివరాల కోసం విచారణ చేపట్టారు.

🏠 Home