🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 October 2025, 1:10 am Posted by : DAINAMIC NEWS

సూర్యాపేటలో  ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు  ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహణ

News Image

డైనమిక్,సూర్యాపేట బ్యూరో, అక్టోబర్ 27




పోలీసు అమరులను స్మరించుకుంటూ సూర్యాపేట పట్టణంలో సోమవారం పోలీసు సంస్మరణ వారోత్సవాల భాగంగా బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు.జిల్లా పోలీసు అధికారి నరసింహ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. పోలీసు విభాగంలో విధి నిర్వర్తనలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను గుర్తుచేస్తూ ఎస్పీ పుష్పాంజలి ఘటించారు.




ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ –




“దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరులు మనకు స్ఫూర్తిదాయకులు. వారి త్యాగాలను స్మరించుకోవడం మన అందరి బాధ్యత”అని తెలిపారు.బైక్ ర్యాలీ సూర్యాపేట పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా కొనసాగింది. ఈ కార్యక్రమంలో పోలీసులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి నినాదాలతో మారుమ్రోగించారు.













🏠 Home