🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 26 October 2025, 11:50 am Posted by : DAINAMIC NEWS

గుండె, మెదడు ఆరోగ్యాలపై మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జివి ఆంజనేయులు

News Image

డైనమిక్,వినుకొండ, అక్టోబర్ 26




వరల్డ్ హార్ట్ డే మరియు బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా, గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం, బొల్లాపల్లి మండల కేంద్రంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించబడింది. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జివి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ముందుగా, అవగాహన ర్యాలీలో పాల్గొన్న జివి ఆంజనేయులు గారు గుండె మరియు మెదడు ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం, ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ శిబిరంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వైద్య నిపుణుల బృందం ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన సలహాలు, మందులు అందించారు. ముఖ్యంగా గుండె జబ్బులు మరియు బ్రెయిన్ స్ట్రోక్‌లకు సంబంధించిన పరీక్షలు, సలహాలు అందించబడ్డాయి.
ఈ సందర్భంగా చీఫ్ విప్ జివి ఆంజనేయులు మాట్లాడుతూ, ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా గుండె జబ్బులు మరియు బ్రెయిన్ స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు , ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వైద్య బృందం, స్థానిక నాయకులు, అధికారులు, మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🏠 Home