🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 25 October 2025, 7:48 am Posted by : DAINAMIC NEWS

బస్సు ప్రమాదం నుంచి తప్పిన ప్రాణాలువేగంగా స్పందించిన డ్రైవర్‌ – పెద్ద ప్రమాదం తప్పింది

News Image

పుట్టపర్తి ,డైనమిక్, డెస్క్ , అక్టోబర్ 25




పుట్టపర్తి నుంచి బెంగళూరు వెళ్తున్న కెఎస్‌ కర్నాటక రాష్ట్ర ఆర్‌టీసీ బస్సు వెంకట గారిపల్లి సమీపంలో ప్రమాదానికి గురైన ఘటనలో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు స్టీరింగ్‌ ఆకస్మికంగా విరిగిపోవడంతో ప్రమాదం సంభవించే పరిస్థితి ఏర్పడింది. అయితే డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి, వాహనాన్ని సైడ్‌కి తిప్పడంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు.ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని సహాయం చేశారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బస్సును సర్వీస్‌ స్టేషన్‌కు తరలించగా, రవాణా అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

🏠 Home