🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 20 October 2025, 1:05 am Posted by : DAINAMIC NEWS

INS విక్రాంత్‌ శక్తికి పాక్‌ భయభ్రాంతులు – ప్రధాని మోడీ

News Image

న్యూఢిల్లీ,డైనమిక్ డెస్క్, అక్టోబర్ 20





భారత నౌకాదళ శక్తిని ప్రతిబింబించే INS విక్రాంత్‌ పాకిస్థాన్‌కు నిద్రలేని రాత్రులు మిగిల్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ఈ వాహక నౌక ఆత్మనిర్భర్‌ భారత్‌, మేక్‌ ఇన్‌ ఇండియా ప్రతీకగా నిలిచిందని తెలిపారు.INS విక్రాంత్‌ సముద్రంలో అడుగు పెట్టినప్పటి నుంచి పాకిస్థాన్‌ నౌకలు ముందుకు కదలడానికే భయపడుతున్నాయి. బ్రహ్మోస్‌, ఆకాశ్‌ మిస్సైళ్లు తమ శక్తిని నిరూపించాయి. ఇది భారత రక్షణ సామర్థ్యానికి కొత్త దిశ చూపిస్తుంది,” అని మోదీ అన్నారు.దేశ రక్షణలో స్వదేశీ తయారీ కీలకమని, భారత్‌ ఇకపై ఇతరులపై ఆధారపడదని ప్రధాని స్పష్టం చేశారు.

🏠 Home