డైనమిక్ న్యూస్ ప్రతినిధి నల్గొండ జిల్లా నవంబర్ 01
నల్గొండ పట్టణలో శనివారం విస్తృతస్థాయి సమావేశం దొడ్డి కొమరయ్య భవన్ లోజరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగ, కార్మికుల పోరాటాల సారధి సిఐటియు నల్లగొండ జిల్లా 13 వ మహాసభలు పోరాటాల పురిటీగడ్డ నల్లగొండపట్టణంలో 2025 నవంబర్ 29,30 తేదీలలో జరుగుతున్నాయని సీ ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం తెలిపారు.ఈ మహాసభలలో జిల్లాలోని 33 మండలాల నుండి జిల్లావ్యాపితంగా వివిధ యూనియన్స్ నుండి 500 మంది ప్రతినిధులు, అఖిల భారత మరియు రాష్ట్ర నాయకులు పాల్గొంటారని అన్నారు.ఐక్యత పోరాటం నినాదంతో 1970 లో సిఐటియు ఏర్పడినప్పటి నుండి దేశంలో కార్మికవర్గ హక్కుల కోసం అనేక పోరాటాలు చేసింది. సిఐటియు కేవలం కార్మికుల హక్కులే కాకుండా, రైతాంగము, వ్యవసాయ కార్మికులు, సామాజిక సంఘాల పోరాటాలకు సంఘీభావంగా అండగా నిలుస్తుంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ విధానాలకు వ్యతికంగా కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్నది. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే విధంగా 2020 సంవత్సరంలో పార్లమెంట్లో బిల్లు 29 కార్మిక చట్టాలను రద్దు పరిచే విధంగా పార్లమెంటులో చట్టం తెచ్చి నాలుగు లేబర్ కోడ్లను అమలుకు ప్రయత్నిస్తున్నది ఈ విధానాలకు వ్యతిరేకంగా గత ఐదు సంవత్సరాలుగా దేశంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్మికుల పోరాటాల ఫలితంగా వాటిని నివారించగలుగుతున్నాం. స్వాతంత్రం నాటినుండి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే విమానయానం ఓడరేవులు టెలికం ఇన్సూరెన్స్ బొగ్గు గనులు బ్యాంకింగ్ ఉక్కు పరిశ్రమలు అన్నింటిని కారు చౌకగా (అంబానీ ఆదానీలకు) కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పుతు దేశ సంపదను సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నదని ఆరోపించారుసిఐటియు జిల్లా సీనియర్ నాయకులు సయ్యద్ హశం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ పరిశ్రమలతో పాటు 73 షెడ్యూల్డ్ పరిశ్రమలలో గత ఏడు సంవత్సరాలుగా కనీస వేతనాలు జీవోలను సవరించటం లేదు. గ్రామపంచాయతీ మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, అశా, అంగన్వాడీ మధ్యాహ్నభోజన కార్మికులు, విఓఏ, ఉపాధి హామీ, ఫీల్డు అసిస్టెంట్ లతో పాటు అనేక రకాలు పార్ టైమ్, గౌరవ వేతన ఉద్యోగులకు వేతనాలు పెంచటం లేదు. భవన నిర్మాణం, హమాలీ, ట్రాన్స్పోర్టు, కార్మికులు సంక్షేమము గాలికి వదిలేసినది. అన్నిరకాల అసంఘటిత కార్మికుల హక్కులు కాలరాయబడుతున్నది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సంఘటిత అసంఘటిత రంగాలలో పనిచేసే కార్మికులకు అనేక వాగ్దానాలు చేసినది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాగ్దానాల అమలు కు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కార్మిక వర్గం తీవ్ర అసంతృప్తికి గురి అవుతున్నదని అన్నారు.జిల్లాలో రాబోవు రోజుల్లో కార్మికుల పక్షాన మరిన్ని పోరాటాలు ఆందోళనలు నిర్వహించేందుకు 2025 నవంబర్ 29,30 తేదీలలో నల్లగొండ పట్టణంలో జరిగే సిఐటియు జిల్లా మహాసభలు వేదికగా కానున్నాయి. ఈ మహాసభలో కార్మికుల ఆర్ధిక, సామాజిక సమస్యలపై చర్చలు జరగనున్నాయి. కార్మిక, కర్షక మైత్రి ద్వారానే పాలకుల దుష్ట విధానాలను తిప్పికొట్టగలమని అన్నారు.మహాసభల ప్రారంభం రోజు నవంబర్ 29న పట్టణంలో జరిగే కార్మిక ప్రదర్శన లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు సలివొజు సైదాచారి, పల్లె నగేష్ కత్తుల యాదయ్య భీమనపల్లి శంకర్ మిరియాల శ్రీవాణి,నాగరాజు, తౌడోజు రాజు, వెంబడి వెంకన్న సాగర్ల మల్లయ్య, దొమ్మాటి సైదులు, పందుల లింగయ్య, షేకావత్, వీరాబాబు, తదితరులు పాల్గొన్నారు
