నేరేడుచర్ల, డైనమిక్, నవంబర్ 14
కార్నర్‌స్టోన్ ఇంటర్నేషనల్ స్కూల్ చిల్లేపల్లి బ్రాంచ్‌లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చిన్నారుల్లో సృజనాత్మకత, ఉల్లాసం, ఆనందాన్ని పెంపొందించే లక్ష్యంతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
చిన్నారుల హక్కులు – విద్యపై అవగాహన కల్పించాలి
భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా జరుపుకునే బాలల దినోత్సవం పిల్లల హక్కులు, విద్య, సంక్షేమంపై సమాజంలో అవగాహన పెంపొందించేందుకు మంచి అవకాశం అని స్కూల్ ప్రిన్సిపాల్ సోలోమన్ రాజు తెలిపారు. పిల్లలపై నెహ్రూ చూపిన ప్రేమను స్మరించుకుంటూ, వారి కలలను నెరవేర్చేందుకు విద్యాసంస్థలు ముందుండాలని ఆయన పేర్కొన్నారు.
నిర్వాహక వర్గం సందేశం
స్కూల్ ఛైర్మన్ డాక్టర్ జగన్ సింగపురం, మేనేజింగ్ డైరెక్టర్ జి. జయపాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవేజ్ బాబా, ప్రిన్సిపాల్ సోలోమన్ రాజు, ప్రిన్సిపాల్-2వెంకటేష్ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.పిల్లలలో ప్రతిభను వెలికితీయడం, సమగ్ర అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించడం సంస్థ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి
ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు, పాటలు, స్కిట్స్‌తో ప్రేక్షకులను అలరించారు. ఉపాధ్యాయులు పిల్లల కోసం ప్రత్యేక గేమ్‌లు నిర్వహించగా, స్కూల్ ఆవరణ పండుగ వాతావరణాన్ని తలపించింది.
