డైనమిక్ , ఎపి డెస్క్, అక్టోబర్ 20
కావలి నియోజకవర్గంలోని దగదర్తి గ్రామంలో ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ స్వర్గీయ మాలెపాటి సుబ్బానాయుడు పార్థివ దేహానికి సోమవారం ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
