గోవా,డైనమిక్ డెస్క్, అక్టోబర్ 28
ప్రతిష్ఠాత్మక చెస్ వరల్డ్ కప్ పోటీలు ఇక నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. దాదాపు 23 ఏళ్ల తర్వాత భారత్‌లో ఈ మహా టోర్నీ జరగడం విశేషం. ఈసారి ఆతిథ్య రాష్ట్రంగా గోవా వేదికగా నిలుస్తోంది.భారత బృందానికి గ్రాండ్‌మాస్టర్ డి. గుకేశ్ సారథ్యం వహించనున్నాడు. ప్రపంచ ఛాంపియన్ గుకేశ్‌కు దేశాన్ని ప్రాతినిధ్యం వహించే ఈ గౌరవం దక్కడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశాడు.ఈ టోర్నీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి చెస్ మాస్టర్లు పాల్గొననున్నారు. గుకేశ్ నేతృత్వంలో భారత జట్టు బలమైన ప్రదర్శన ఇవ్వనుందని అభిమానులు ఆశిస్తున్నారు.
