ఏలూరు జిల్లా, చట్రాయి, డైనమిక్ డెస్క్
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన చాట్రాయి మండలం, ఇప్పుడు ఉపాధ్యాయ ఉద్యమాలకు కేంద్ర బిందువుగా మారింది. డెమోక్రటిక్ పి.ఆర్.టి.యూ చాట్రాయి మండల శాఖ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం నుండి రాత్రి పొద్దుపోయేంతవరకు నూతన ఉపాధ్యాయులకు స్వాగతాభినందన సదస్సు ఘనంగా నిర్వహించారు.ఈ సదస్సులో 52 మంది నూతన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మండల శాఖ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామారావు, రాష్ట్ర కార్యదర్శి ఆర్. నాగేశ్వరరావు, జిల్లా నాయకులు ఎం. తిరుపతయ్య తదితరులు సమన్వయం చేశారు. ముఖ్య అతిథులుగా విస్సన్నపేట నుండి విచ్చేసిన సీనియర్ నాయకులు పెండెం రామకృష్ణ, ఆర్. శోభన్ బాబు, కొండా రాజ్‌కుమార్, టి. శ్రీరామ్ మూర్తి, శంకర్, నాగరాజు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.ప్రతి నూతన ఉపాధ్యాయునికి శాలువాతో సత్కారం, సర్వీస్ రిజిస్టర్ (ఎస్.ఆర్), సర్వీస్ రూల్స్ పుస్తకం, సర్టిఫికెట్ అందజేశారు.కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.ఉపాధ్యాయ ఉద్యమానికి బలాన్నిచ్చే విధంగా ఈ సదస్సు నిలిచిందని జిల్లా నాయకులు తెలిపారు.డెమోక్రటిక్ పి.ఆర్.టి.యూ మండల శాఖలు వరుస కార్యక్రమాలతో జిల్లాలో చురుకైన పాత్ర పోషిస్తున్నాయని డా. డి.ఎస్., పి.వి.ఆర్. హృదయపూర్వకంగా అభినందించారు.
