డైనమిక్ న్యూస్, గుంటూరు, నవంబర్ 27
ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజిమెంట్ వంటి ఉన్నత చదువుల్లో రాజ్యాంగ పరమైన అంశాలను తప్పనిసరిగా బోధించాల్సిన అవసరం ఉందని సి.జి.హెచ్.ఎస్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి. విద్య సూచించారు.
రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
బుధవారం నగరంపాలెంలోని సి.జి.హెచ్.ఎస్ (సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్) వెల్‌నెస్ కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
రాజ్యాంగమే సర్వోన్నతం
ఈ సందర్భంగా డాక్టర్ విద్య మాట్లాడుతూ భారతదేశంలో రాజ్యాంగమే సర్వోన్నతమని, అన్ని వ్యవస్థలు, సంస్థలు కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలన్నారు.
దేశ ఐక్యతకు రాజ్యాంగమే పునాది
డెబ్భై ఆరు సంవత్సరాలుగా దేశాన్ని అఖండంగా నిలుపుతున్న శక్తి రాజ్యాంగమేనని, ఇది భారతదేశం సాధించిన గొప్ప విజయమన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, లిఖిత రాజ్యాంగం కలిగిన దేశంగా భారత్ నిలవడం మనకు గర్వకారణమన్నారు.
11 నెలలు 18 రోజుల రాజ్యాంగ రచన
ఆంగ్లేయులు దేశం విడిచి వెళ్లాక రాజ్యాంగ రచన ప్రారంభమై, దానిని పూర్తిచేయడానికి పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టిందని తెలిపారు.
ప్రజల ఆశయాలకు ప్రతిరూపం
భారత రాజ్యాంగం ప్రజల ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలకు ప్రతిబింబమని, ప్రజల విశ్వాసానికి, పాలనా విలువలకు ప్రతిరూపంగా నిలుస్తోందన్నారు.
రాజ్యాంగ ప్రతిజ్ఞ
కార్యక్రమం ముగింపులో వైద్యులు, సిబ్బంది రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో హేమాసుందరి, అయోషా బేగం, మురళీ, రామారావు, సునీల్, మక్బుల్, వెంకటేశ్వర్లు, రత్న రాజు, నందమణి పాల్గొన్నారు.
