సూర్యాపేట బ్యూరో, జనవరి 6 (డైనమిక్ న్యూస్)
సైబర్ నేరాల నియంత్రణలో విశేష ప్రతిభ కనబరిచిన సూర్యాపేట జిల్లా పోలీస్ సైబర్ వారియర్స్‌కు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, సైబర్ సెక్యూరిటీ అదనపు డీజీ షికా గోయల్ చేతుల మీదుగా నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
సైబర్ నేరాల పరిష్కారంలో ప్రతిభ
సైబర్ మోసాలకు గురైన బాధితుల నగదును తిరిగి వారి ఖాతాల్లో జమ చేయడం, కేసులను త్వరితగతిన ఛేదించడం, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రతిభ చూపినందుకు ఈ ప్రశంసలు లభించాయి.
ప్రశంసలు అందుకున్న సిబ్బంది
ఈ కార్యక్రమంలో
🔹 సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ సైబర్ వారియర్ కానిస్టేబుల్ శ్రీనివాస్
🔶 కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ సైబర్ వారియర్ కానిస్టేబుల్ శివకుమార్
🔺 సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ సైబర్ వారియర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు
ప్రశంసా పత్రాలు అందుకున్నారు.
ఎస్పీ అభినందనలు
ప్రశంసా పత్రాలు అందుకున్న సైబర్ వారియర్స్ మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందిని అభినందించి, భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్ వారియర్స్
సూర్యాపేట జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ ఆధ్వర్యంలో ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్ వారియర్స్ సేవలందిస్తున్నారని అధికారులు తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణలో జిల్లా పోలీసుల కృషికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించడం పట్ల జిల్లా పోలీసు శాఖ హర్షం వ్యక్తం చేసింది.ఈ కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.
