మఠంపల్లి, అక్టోబర్ 17, డైనమిక్ న్యూస్

హుజుర్ నగర్, మట్టపల్లి ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసం ఐనదని మఠంపల్లి మండల బి ఆర్ ఎస్ నాయకుడు నరాలశెట్టి గోపి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ చౌటపల్లి, పెదవీడు, సుల్తాన్ పురం గ్రామాల వద్ద రోడ్డు పూర్తిగా ధ్వంసం కాగా మరికొన్ని చోట్ల గుంతల మాయంగా మారించిన్నారు. ఈరహదారిలో వాహనాల రద్ది ఎక్కువ గా ఉండడంతో దుమ్ము ధూళి తీవ్రంగా వస్తుండడంతో ఇండ్లలో ఉండలేక పోతున్నామని అన్నారు. నాలుగు లైన్ల రహదారి మంజూరై నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకొని రోడ్డుకు మారమ్మతులైనా చేయించాలని కోరారు
